![]() |
![]() |

"నీతోనే డాన్స్" ఈ వారం రెండు రోజులు జరిగిన షోలో రెండు జంటలు కొంచెం అగ్రెసివ్ గా ప్రవర్తించినట్టు అనిపించింది. నటరాజ్ మాష్టర్ - నీతూ రెట్రో రౌండ్ లో సీనియర్ ఎన్టీఆర్, నాగేశ్వరావు, కృష్ణ గెటప్స్ తో వాళ్ళ సాంగ్స్ కి డాన్స్ చేశారు..ఐతే వీళ్లకు అంజలి, పవన్ , కావ్య, నిఖిల్ జంటలు చాలా తక్కువ మార్క్స్ ఇచ్చారు. "ఇంకా కొన్ని స్టెప్స్ ఉంటే బాగుండు అని పవన్ నటరాజ్ మాష్టర్ కి చెప్పేసరికి ఇంకా స్టెప్స్ కావాలా..ఇప్పటికే చాలా స్టెప్స్ వేసాం..ఈ డాన్సస్ ని ఒరిజినల్ క్యారెక్టర్స్ లో ఉన్నవాళ్లు ఉంటే ఎలా చేస్తారో చేసాం" అని చెప్పారు. "అసలు వాళ్ళ సాంగ్స్ లో ఇన్ని మూవ్మెంట్స్ ఉండవు కానీ మేము ఇంకా ఇంప్రొవైజ్ చేసి చూపించాం" అన్నారు.
"నాగేశ్వరావు గారి స్టెప్స్ వేసేటప్పుడు రెండు మూడు సార్లు నాగేశ్వరరావు గారు వచ్చారు" అని అంజలి అనేసరికి వీడియో చూపించు " అన్నారు నటరాజ్ మాష్టర్ జోడి...ఇక ఇక్కడ మార్క్స్ విషయంలో రచ్చ రచ్చ ఐపోయింది. ఇక నటరాజ్ కోపం పీక్స్ కి వెళ్ళిపోయింది "థాంక్ గాడ్ వీళ్ళు నన్ను జడ్జ్ చేసే అవకాశం ఇచ్చినందుకు" అని కామెంట్ చేసేసరికి స్టేజి మొత్తం ఒక్కసారి షాకయ్యారు. ఇక రెండో రోజు ఎపిసోడ్ లో ఆట సందీప్ జోడి ఎన్టీఆర్ గెటప్ లో ఆయన సాంగ్స్ ని చేశారు. "రావోయి చందమామ" సాంగ్ కి "ఇంకా డాన్స్ ఎక్కడో తగ్గింది అనిపించింది" అంటూ శివ్ చెప్పేసరికి సందీప్ ఫైర్ అయ్యాడు. "ఆయన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు వేసాను అంతే కానీ డాన్స్ తక్కువ అనొద్దు"..అంటూ సీరియస్ గా మాట్లాడేసరికి అక్కడ వాతావరణం అంతా హాట్ గా మారిపోయింది. "రెట్రో థీమ్ కాబట్టి బోర్డర్స్ ని క్రాస్ చేయలేము కదా ..చెప్పిన రీజన్ కరెక్ట్ ఉండాలి " అన్నాడు సందీప్...
![]() |
![]() |